ఝరాసంగం : మరిగమ్మ మోతిమాత ఆలయం వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని, ఆలయ పరిసరాల్లో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తామని జహీరాబాద్ ఎంపి సురేష్ కుమార్ షేట్కర్ హామీ ఇచ్చారు. సోమవారం నియోజకవర్గం లోని మొగుడంపల్లి మండలం లో మరిగమ్మ మోతిమాత జాతర మహోత్సవం లో పాల్గొని అమ్మవారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీకి పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్జ్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు మక్సుద్ ,హన్మంతరావు పటేల్, రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, ,యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, ఐన్టియుసిఏఫ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ , బ్లాక్ ప్రెసిడెంట్ హర్షద్ అలీ , ఎఎంసి డైరెక్టర్లు కిషన్ రాథొడ్ , వంశీ రాజ్, మాజీ జడ్పీటిసి కిషాన్ పవార్ కాంగ్రెస్ నాయకులు చందర్ నాయక్ , శంకర్ నాయక్,ప్రేమ్ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.