ఉస్మాన్ నగర్ రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రపురం, జనవరి 18 సిరి న్యూస్ః
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ రేడియల్ రోడ్డులో భూమిని కోల్పోతున్న రైతులకు మెరుగైన నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉస్మాన్ నగర్ వార్డు కార్యాలయంలో రైతులు, హెచ్ఎండిఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పరిహారం అందిస్తే భూమిని ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉస్మాన్ నగర్ నుండి వట్టినాగులపల్లి వరకు నిరూపించిన రేడియల్ రోడ్డు అత్యంత కీలకమని తెలిపారు. ఉస్మాన్ నగర్ పరిధిలో కొంతమంది రైతులు భూమి ఇవ్వకపోవడం మూలంగా రోడ్డు పనులు నిలిచిపోయాయని తెలిపారు. భూమి కోల్పోతున్న ప్రతి రైతుకు ప్రభుత్వంతో చర్చించి మెరుగైన టిడిఆర్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు స్పందించిన రైతులు భూములు అందించేందుకు సమ్మతించారు. రైతులను కాపాడుకునే పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో హెచ్ఎండిఏ ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు చిట్టి ఉమేష్, పర్సా శ్యామ్ రావు, రైతులు పాల్గొన్నారు.