సద్వినియోగం చేసుకొని.. దివ్యాంగులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
దివ్యాంగుల జాబ్ మేళా ను ప్రారంభించిన కలెక్టర్
సంగారెడ్డి, జనవరి 8 సిరి న్యూస్ : జిల్లాలోని దివ్యాంగులకు ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు ఇప్పించి వారికి ఉపాధి కల్పించడం హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి (sangareddy collector valluru kranthi) అన్నారు బుధవారం జిల్లాలోని దివ్యాంగుల కు ఉపాధి కల్పించడం కోసం జిల్లా ఉపాధి కల్పన శాఖ మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళాను సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉపాధి కల్పనా శాఖ, జిల్లా మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధులు వికలాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో జిల్లాలోని వివిధ కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ సెక్టార్ కంపెనీలలో వారి అర్హతల మేరకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు . ఈ అవకాశాన్ని జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులు సాధారణ పౌరుల వలె మెరుగైన జీవితం గడపడం కోసం ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకొని దివ్యాంగులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. జాబ్ మేళాలు సుమారు 200 ఉద్యోగాలను 32 కంపెనీలు కల్పించడానికి ముందుకు వచ్చాయన్నారు. జాబ్ మేళాకు సుమారు 156 మంది దివ్యాంగులు హాజరయ్యారని, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు 57, ఎనిమిది మంది అభ్యర్థులకు నియామకం పత్రాలు అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు ఐదువేల వరకు వివిధ రకాల కంపెనీలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చే నెలలో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లాలోని అన్ని కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడనున్నట్లు తద్వారా ఎక్కువమంది దివ్యాంగులకు ఇతర నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తక్కువ సమయంలో జాబ్ మేళా ఏర్పాటుకు కృషిచేసిన జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి అనిల్ కుమార్జి,ల్లా మహిళా సంక్షేమ అధికారిని లలిత కుమారి లను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, యూత్ ఫర్ జాబ్స్ మేనేజర్ అశ్విన్ , వివిధ కంపెనిల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.