వైభవంగా శ్రీ శీతల నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు
నర్సాపూర్ జనవరి 17 (సిరి న్యూస్)
నర్సాపూర్ పట్టణంలో శ్రీ శీతల మాత ( నల్లపోచమ్మ ) దేవాలయ నవమ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యేతో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీమ్ ఉన్నారుఅనంతరం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్త,నర్సాపూర్ మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, లలిత నర్సింగ్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, నరేష్, సతీష్,రాజు యాదవ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనారు
