నర్సాపూర్[Narsapur] జనవరి 30 (సిరి న్యూస్)
అంగవైకల్యంతో బాధపడుతున్న నిరుపేదలకు కృత్రిమ అవయవాలు అందించాలనే ఉద్దేశంతో మహిళా, శిశు ,దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలికో సంస్థ దివ్యాంగులక కొరకు ఉచిత బ్యాటరీ ట్రై సైకిల్ ఎంపిక మరియు కృత్రిమ అవయవాల కొలతలు శిబిరం శుక్రవారం నర్సాపూర్ రైతు వేదికలో నిర్వహించారు వివిధ గ్రామాల నుండి వికలాంగులు వయోవృద్ధులు శిబిరానికి హాజరై సుమారుగా 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారులు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలికో సంస్థ వైద్యులు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ హైమావతి సిడిపిఓ హేమ భార్గవి అల్లాదుర్గం సిడిపిఓ పద్మలత డిస్టిక్ వెల్ఫేర్ అధికారులు ఆరోగ్య అధికారులు పోలీస్ అధికారులు అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు