నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ని విమర్శిస్తే.. సహించేది లేదు….
కొల్చారం : మాది ఉద్యమ పార్టీ.. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం.. ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్.. రాజా గౌడ్… 420 కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసిస్తూ. భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో. గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన నాయకులు.మాది ఉద్యమ పార్టీ అని అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చామని.. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని. మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్. కరెంటు రాజా గౌడ్ అన్నారు.
గురువారం నాడు. మండల కేంద్రమైన కొల్చారంలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందజేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పై. అనుచిత విమర్శలు చేసే సహించేది లేదని. తాము ఉద్యమ పార్టీ నుండి వచ్చామని. ఉద్యమాలు చేయడం కొత్త కాదని. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ రాజ్యాగౌడ్ మాట్లాడుతూ. 420 కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేయలేదని.కేవలం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మాత్రమే కల్పించిందని. అది కూడా సమయానికి రాని బస్సులు. వచ్చిన బస్సులు కూడా కిక్కిరిసిపోతున్నాయని. దీనికి కూడా మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని పెట్టుబడి సహాయం ఇంకా అందించకపోవడం దురదృష్టకరమని వానకాలం పూర్తి అయి రైతులు మరోసారి పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న ఇప్పుడు వేస్తాం అప్పుడు వేస్తామంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 10 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా అమలు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దినన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ మనోహర్ ముత్యం ప్రవీణ్ కుమార్ గుప్తా మేదరి విట్టల్ ఖదీర్ చౌరి గారి అశోక్ గ్యాస్ కృష్ణ ఎర్రోళ్ల శ్రీనివాస్ వెంకటేశం గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.