రసాభాసగా మారిన పేట గ్రామసభ

Peta Gram Sabha which has become Rasabhasa
Peta Gram Sabha which has become Rasabhasa

పెద్ద శంకరంపేట[pedda sankarampeta],(సిరి న్యూస్);
మండల కేంద్రమైన పెద్ద శంకరంపేట లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఇంతవరకు అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు రాకపోవడంతో పలువురు తమకు ఎందుకు నూతన రేషన్ కార్డులు మంజూరు కాలేవని అధికారులను నిలదీశారు. పేట తహసిల్దార్ గ్రేసి బాయి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రమేష్ పేట పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు, పేట తాజా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భవాని, నాయకులు ఆర్ఎన్ సంతోష్ కుమార్, సుభాష్ గౌడ్. గంగారెడ్డి, బాను, విఠల్ రెడ్డి, నరసింహ చారి, హరికిషన్, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.