రాక్ చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

వంద‌ల సంఖ్య‌లో భ‌క్తులు
ఏసు యందు విశ్వాస‌ముంచాల‌న్న పాస్ట‌ర్ యేసుపాల్

సంగారెడ్డి, జ‌న‌వ‌రి 1 సిరి న్యూస్ : పోతిరెడ్డిపల్లి కందిలోగల రాక్ చర్చిలో ఘనంగా క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గడిచిన సంవత్సరంలో దేవుడు చేసిన కార్యములను తలచుకుంటూ ఆయన అనుగ్రహించిన క్షేమమును బట్టి భద్రతను బట్టి కాపుదలని బట్టి మందిరంలో ఉన్న వారందరూ ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నపిల్లల కార్యక్రమాలు స్త్రీల కార్యక్రమాలు యవనస్తుల కార్యక్రమాలు వచ్చిన భక్తులను ఎంతగానో అలరించాయి, చక్కని నృత్యాలతో కొరియోగ్రఫీలతో సభ దేవుని యందు ఆనందించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాస్టర్ ఎం. యేసుపాల్ మునుపటి కంటే అధికమైన మేలు దేవుని యందు విశ్వాసముంచిన వారు ఈ సంవత్సరం పొందుకోబోతున్నారని తెలియజేశారు ప్రత్యేక ప్రార్థనలలో సంఘ పెద్దలు పరిచారకులు పాస్టర్లు భక్తులు పాలు పొందారు సంవత్సరమంతా కూడా విడువక దేవుని నామస్మరణ భక్తులు చేయాలని పాస్టరు ప్రసంగించారు.