నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
పద్మశాలీ నూతన కార్యవర్గం నియామకపత్రాల అందజేత
సంగారెడ్డి, జనవరి 2 సిరి న్యూస్ : నూతన క్యాలెండర్ ను, మహిళ విభాగం క్యాలెండర్ ను సంగారెడ్డి రాజంపేటలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, రాష్ట్ర పద్మశాలి అధ్యక్షులు మురళీ మహిళా విభాగం అధ్యక్షురాలు రూప హాజరయ్యారు.అనంతరం జిల్లా ప్రాంత పద్మశాలీ సంఘం నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను ఎమ్మెల్యే చేతల మీదుగా అందజేశారు .ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ..మీరే అభ్యర్థులమని నా గెలుపుకు కృషి నా ప్రతి ఒక్కరికీ శిరస్సువంచి పాదాభివందనం.
పద్మశాలి సంఘం నేతల సమస్యలను కొట్లాడైన సాధించుకుందాం. మీరు అందరూ నాకు సహకరించాలి. కలిసి ఉంటే నిలిచి ఉంటాం. విడిపోతే పడిపోతాం.. కలిసిపోతే బలసిపోతం. ఆ నానుడి దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాలి. మీకు అండగా ఉంటా… పద్మశాలి సంఘం నేతల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం నేతలు మహిళలు పాల్గొన్నారు.