- సిసిరోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన
- ఎంపీడీవో కార్యాలయంలో కూరగాయలు నాటిన ఎంపీడీవోను అభినందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
గుమ్మడిదల రూరల్ జనవరి17 సిరి న్యూస్
పటాన్ చెరువు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల కేంద్రంలో 40 లక్షల రూపాయలు ఎన్ఆర్జిఎస్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ మాజీ ఎంపీపీ సద్ది విజయభాస్కర్ రెడ్డి నక్క వెంకటేశం గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట నరసింహారావు సురభి నాగేందర్ గౌడ్ సురభి కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి అభిషేటి రాజశేఖర్ మద్దుల బాల్రెడ్డి దేవేందర్ రెడ్డి హుస్సేన్ బాలకృష్ణారెడ్డి, తుపాకుల రాజు, మొగులయ్య, ఆంజనేయులు యాదవ్, రమేష్, లక్ష్మణ్, వినోద్ గౌడ్ శేఖర్ గౌడ్, ప్రభుత్వ అధికారులు ఎంపీడీవో ఈవో ఏడి తదితరులు పాల్గొన్నారు
ఎంపీడీవోను అభినందించిన ఎమ్మెల్యే..
ఎంపీడీవో ఆఫీస్ లలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు ఏవేవో మొక్కలు పెడుతూ ఉంటారు కానీ గుమ్మడిదల మండలంలలోని ఎంపీడీవో ఆఫీస్ లో ఉమాదేవి ప్రత్యేకంగా గార్డెన్ పెట్టకుండా ఆకుకూరలు పెంచింది. అందులో 8 రకాల ఆకుకూరలు పెట్టించింది. ఈసందర్భంగా ఆమెను ఎమ్మెల్యే అభినందించారు. . ఇలాంటి ఎంపీడీవో ఉమాదేవి ఎక్కడ ఉన్నా ఆఫీసు పరిశుభ్రంగా ఉంటుందన్నారు