గుమ్మడిదల: మైత్రి ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ ఐఏఎస్ అధికారి డా. జయప్రకాష్ నారాయణ ప్రశంసించారు. బుధవారం ట్రస్ట్ చైర్మన్ చెన్నం శెట్టి ఉదయ్ కుమార్ ఆయనను కలిసి ఫౌండేషన్ ద్వారా అందించిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యా, ఆరోగ్య రంగాలు అత్యంత కీలకం అని, మైత్రి ఫౌండేషన్ వీటిపై తీసుకుంటున్న చొరవ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నవీన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.