-ఆదివారం ప్రారంభించనున్న జిల్లా ఎస్పీ
మెదక్ జిల్లా:మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించనున్నారు. దొంగతనాల నివారణ, అపరిచితుల సంచారం తెలుసుకోవడం కోసం గ్రామానికి చెందిన దోమకొండ వెంకటరమణ, అనిత దంపతులు వాళ్ల కుటుంబ సభ్యులైన అనంతరాములు, విజయ ప్రసాద్, తల్లి మెట్టమ్మ ల జ్ఞాపకార్థం జీడిపల్లి గ్రామంలో 60, మధిర గ్రామమైన గొల్లగడ్డలో 8 సీసీ కెమెరాలు రూ .12 లక్షల ఖర్చుతో సొంతగా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ తో పాటు ఏఎస్పీ, మహేందర్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, డి.ఎస్.పి సోమ వెంకటరెడ్డి, సీఐ రంగాకృష్ణ, స్థానిక తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ సుభాష్ గౌడ్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొంటారని వెంకటరమణ తెలిపారు.
రైటప్ః గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న దృశ్యం