కాంగ్రెస్ వాళ్లకి హేచ్చరించిన బి ఆర్ యస్ నాయకులు.
ఐ డి ఏ బొల్లారం,[IDA Bollaram] సిరి న్యూస్, జనవరి 22 :
జిన్నారం మండలం బొల్లారం లోని బి ఆర్ యస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బి ఆర్ యస్ సీనియర్ నాయకులు, మాజీ జెడ్ పి టీ సి కోలన్ బాల్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ వూరుకోమని ప్రత్యక్షంగా హేచ్చరించారు. బుధవారం నాడు బి ఆర్ యస్ నాయకులు మాట్లాడుతూ ముందు మీ కాంగ్రెస్ పార్టీ లో వున్న వర్గ పోరును సరిచేసువాలని మా నాయకుడు బాల్ రెడ్డి ఎం పి టీ సి, ఎం పి పి, జెడ్ పి టీ సి, చేసి తన సతీమణి ని ఒకసారి సర్పంచ్, ఒకసారి మున్సిపల్ చైర్మన్, తన సోదరుడు రవీందర్ రెడ్డి ని ఒకసారి ఎం పి పి గా గెలిపించిన ఘనత బాల్ రెడ్డిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ యస్ అధ్యక్షులు నాయకోటి రాజేష్, పలువురు కౌన్సిలర్ లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎం పి టీ సి లు పాల్గొన్నారు.