కొల్చారం : కొల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో టిఆర్ఎస్ to సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి ఎంపీపీ.. మాజీలుగా ఉన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ గ్రామము మాత్రం సర్పంచ్లు ఎంపీటీసీ ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే? ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్టు రాకపోవడంతో తూతూ మంత్రంగా ప్రచారం నిర్వహించినప్పటికీ దగ్గర ఉండి సునీత లక్ష్మారెడ్డి గెలిపించినప్పటికీ కెసిఆర్ ఇచ్చిన ఎన్నికల ఎంపీ హామీ మరిచిపోవడంతో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొల్చారం మండల వ్యాప్తంగా 21 గ్రామపంచాయతీలో ఉండడం. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మంచి పేరు కలసి వస్తుంది. ఒకవేళ స్థానిక ఎన్నికలలో మదన్ రెడ్డి గట్టిగా ప్రయత్నం చేస్తేఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు. మండల పరిధిలోని పైతర గ్రామానికి చెందిన సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డికాంగ్రెస్లోని ఉండడం ఇద్దరూ కలిస్తే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి చేదు అనుభవం స్పష్టంగా వచ్చి తీరుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. మదన్ రెడ్డికి ప్రతి గ్రామంలో మంచి ఫాలోయింగ్.. గ్రామాలలో ఉన్న ప్రతి లీడర్ ను పేరు పెట్టి పిలవడం.. ఇది ఒక ప్లస్ పాయింట్.. సునీత లక్ష్మారెడ్డి విషయానికి వస్తే.కొల్చారం మండలాన్ని అనేక అభివృద్ధి పనులు చేసిన అవి ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కష్టపడి మండల కేంద్రంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించిన ఘనత అప్పటి కాంగ్రెస్ మంత్రి సునీత లక్ష్మారెడ్డి దే. దానితోపాటు. ఏడుపాయల వన దుర్గ మాత దర్శనానికి వెళ్లేందుకు. కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి. స్థానిక ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సైతం సౌకర్యంగా గుర్తుపెట్టుకుంటున్నారు.
రంగంపేట గ్రామం నుండి టెక్మలు మండలానికి చేరేందుకు.. అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి సహాయంతో. బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేశారు.. అనంతరం. రెండు పర్యాయాలు.. మదన్ రెడ్డి చేతిలో ఓటమిపాలు కాగా. కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరి… శ్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా కమిషనర్ బాధ్యతలు నిర్వహించారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కేటీఆర్ హామీతో.. మదన్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలలో.. సునీత లక్ష్మారెడ్డి. మదన్ రెడ్డి ఇస్సహాయంతో. గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంపీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.. మదన్ రెడ్డికి సముచిత స్థానం ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో.. మదన్ రెడ్డి హవ కొనసాగి అవకాశం స్పష్టంగా ఉన్నట్లు సమాచారం… కొల్చారం కౌడిపల్లి మండలాలలో.. కచ్చితంగా జడ్పిటిసి ఎంపీపీ ఎంపీటీసీలు.. సర్పంచ్ స్థానాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. ఎవరు అనుకుంటే వారీనీ.. గెలిపించుకుంటారని. పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్.. ఆవుల రాజిరెడ్డి సైతం… ఎన్నికలకు ముందు నుండి.. అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు. అనేక సేవలను అందించారు.. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. స్థానిక ఎన్నికలలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి… మదన్ రెడ్డి రవీందర్ రెడ్డి ఆవుల రాజిరెడ్డి. పద్య ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగి అవకాశం ఉంది.