మనోహరాబాద్, జనవరి 12 సిరి న్యూస్ : రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, ఇతర ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి డబ్బులు లేక అప్పుల బాధతో ఇబ్బందులు పడే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహద పడుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (Narsapur MLA Sunitha Lakshmareddy) తెలిపారు. మండలంలోని గౌతోజి గూడెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రైవేటు ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు చేసుకున్న వారికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం హైదరాబాదులోని తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అలాగే కాళ్ళకల్ లో ఉన్న రామ ఆగ్రో సీడ్ కంపెనీకి చెందిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌతోజి గూడెం గ్రామ తాజా మాజీ సర్పంచ్ రేణు కుమార్, రామ ఆగ్రో సీడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ యాదవ్ ప్లాంట్ మేనేజర్ మహేందర్, సెల్స్ మేనేజర్ ఆంజనేయులు ,నాయకులు ముత్యాలు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.