బస్టాపుల్లో ఆగని బస్సులు – ప్రయాణికులకు గోసలు

buses-that-dont-stop-at-bus-stops-are-a-nuisance-to-passengers
buses-that-dont-stop-at-bus-stops-are-a-nuisance-to-passengers

వృధాగా బస్టాండ్లు
పాలకుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపం
సిరి న్యూస్/ గుమ్మడిదల[Gummadidalila]
ప్రయాణికుల కోసం లక్షల వెచ్చించి నిర్మాణం చేపట్టిన బస్టాండ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. మండల కేంద్రమైన గుమ్మడిదల మరియు నూతన మున్సిపాలిటీ అయిన గుమ్మడిదలలో బస్టాండ్ ప్రయాణికులకు వినియోగంలో లేకుండా పోయింది. రోడ్డు పక్కన బస్సును ఆపి ప్రయాణికులను దించడం కానీ ఎక్కించుకోవడం గాని జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యమా లేదా పాలకుల పట్టించుకోకపోవడం బస్టాండ్ ముందు బస్సులు నిలపకుండా ఆటోలు నిండిపోవడంతో బస్సులకు ఇబ్బందికరంగా మారింది. ప్రయాణికులు బస్టాండ్లో కూర్చోవడానికి వీలున్నది అయినప్పటికీ బస్టాండ్ ముందు పూర్తిగా ఆటోలు నిలపడం మూలాన బస్టాండ్ లో ఎవరు కూర్చోలేకపోతున్నారు బస్సు వచ్చేది వారికి కనిపించలేని పరిస్థితి ఎదురైంది.
నిరుపయోగంగా నేషనల్ హైవే బస్టాండ్లలు
నేషనల్ హైవే అథారిటీ వారు హైవేల పక్కన ప్రతి గ్రామంలో బస్టాండ్లను నిర్మాణం చేపట్టారు కానీ ఎవరికి ఉపయోగకరంగా లేకుండా పోయినాయి జనాలున్న చోట బస్టాండ్లను ఏర్పాటు చేయడం మరిచి వారికి నచ్చిన స్థలంలో ఏర్పాటు చేశారు కానీ ఎక్కడ కూడా ఆ బస్టాండ్ ల వద్ద బస్సులను నిలపడం లేదు ఎందుకు పనికిరాకుండా పోయినాయి.
పోలీస్ శాఖ అధికారులు పట్టించుకునే ….
బస్టాండ్ పరిసర ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలు ఆటోలు వారి ఇష్టాను రీతిలో ఆపడం మూలాన తరచు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయంలో పలుసార్లు దినపత్రికలలో కూడా వచ్చాయి అయినా ఏ స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. బస్టాండ్ ముందు ఉదయం సాయంత్రం సమయంలో పారిశ్రామిక వాడ ప్రాంతం కావున ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది ఆ సమయంలో వచ్చిన బస్సులు నిలపడానికి వీలు లేకుండా ప్రైవేట్ వాహనాలు ఆటోలు ఇష్టాను రీతిలో నిలపడం జరుగుతుంది ఈ విషయంలో మున్సిపల్ శాఖ అధికారులు గానీ పోలీస్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు