నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్..
పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి..
ఉమ్మడి జిల్లా వ్యక్తికి దక్కడం పట్ల హర్షం..
సంగారెడ్డి : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను బీజేపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి పేరును ఖరారు చేసింది. బీజేపీలో రాష్ట్ర నాయకునిగా కొనసాగుతూ మరోవైపు ఎస్ఆర్ ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్టును ఆశించినా అధిష్టానం టికెట్టు కేటాయించలేదు.
ప్రస్తుతం అంజిరెడ్డి సతీమణి గోదావరి సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అంజిరెడ్డికి పార్టీ కార్యకర్తల్లో, యువతలో మంచి క్రేజీ ఉండడంతో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డికి అవకాశం రావడం పట్ల బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.