భారత్ సంవిధాన్ గౌరవ్ దివ‌స్‌ను వారం రోజులు నిర్వ‌హించాలి -ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు

సంగారెడ్డి, జనవరి 20 ( సిరి న్యూస్ ) : సంగారెడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాత్రికేయుల సమావేశం నిర్వ‌హించారు. ఈస‌మావేశంలో మెదక్ కరీంనగర్ నిజాంబాద్ అదిలాబాద్ బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజి రెడ్డి, మరియు బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి సమావేశంలో పాల్గొన్నారు.

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ..కాంగ్రెస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించడం జరిగిందని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఎన్నికల్లో ఓడించారాని, ప్రధాని మోడీ ప్ర‌భుత్వం పంచతీర్థలను అభివృద్ధిని చేసిందని, రాహుల్ గాంధీ తెల్ల టీషర్టు వేసుకొని నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని అంజిరెడ్డిని ప్రకటించడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా కార్యాలయంలో శాంత కుమార్ జిల్లా ఎన్నికల అధికారి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆరు మోసాలు పైన , భారత్ సంవిధాన్ గౌరవ్ దివాస్ కార్యక్రమాన్ని వారం రోజులు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మందుల నాగరాజ్, కసినివాసు ఆదిలి రవీందర్, ద్వారకా రవి, కొవ్వూరి సంగమేష్ జగన్ ,డాక్టర్ రాజు గౌడ్, ప్రతాప్ రెడ్డి దోమల విజయకుమార్ , తదితరులు పాల్గొన్నారు.