జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా.. భవాని
పెద్ద శంకరంపేట : మెదక్ జిల్లా(Medak District) కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పెద్ద శంకరంపేట(Pedda Shankarampet) కు చెందిన అవుసుల భవాని(Avusula Bhavani)నియామకం చేశారు. ఈ మేరకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నాయకురాలు అల్కలాంబ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీత రావులు నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా బుధవారం జారీచేశారు.
ఈ సందర్భంగా బుధవారం భవాని మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించినందుకు రాష్ట్ర మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అలాగే మెదక్ ఉమ్మడి జిల్లా ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు నగేష్ తో పాటు, ఎంపీ, ఎంఎల్ఏ లను హైదారాబాద్ లో శాలువాలు పూలమాలలతో అవుసుల భవాని సన్మానించారు. మండల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు రాజేష్ కుమార్, నాయకులు జనార్ధన్, గంగారెడ్డి, నరసింహచారి, సత్యం, హరికిషన్, సంగమేశ్వర్, తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.