పెద్ద శంకరం పెట[pedda sankarampeta], (సిరి న్యూస్):
స్థానిక శ్రీ రామాలయ అర్చకులు, పట్టణ పురోహితులు, రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్రశేఖర్ కు గుజరాత్ లోని అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం నందు శుక్రవారం నాడు ఘన సన్మానం జరిగింది. రుద్ర పరిషద్ అందోలు శాఖ ఆద్వర్యం లో సంఘ సభ్యులు గత 10 రోజులుగా గుజరాత్ జ్యోతిర్లింగాల దర్శనం తో బాటు లోక కల్యాణర్థం ప్రత్యేక పూజలు, అభిషేకములు, పారాయణములు, నిర్వహించడం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు గుడి. రాఘవేంద్ర చారి. జోషి. శేషాద్రి శర్మ. భుజంగ శర్మ. గుడి శ్రీనాథ్, ప్రముఖ వేద పండితులు జోషి ఆదిత్య శర్మ. రామేశ్వర్ రావు శర్మ. తదితరులు, మహిళా సభ్యులు, అధిక సంఖ్య లో పాల్గొన్నారు.