జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి..
త్రాగునీటి సమస్య తీర్చడం ప్రవీణ్ కుమార్ నిస్వార్థ సేవకు ప్రతీక..
మండల విద్యాధికారి కృష్ణ..
గజ్వేల్ : గజ్వేల్ పట్టణం బాలుర విద్యా సౌధంలోని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సమస్య తలెత్తింది. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న అరకొరగా వస్తున్న పాఠశాలలో సంపు లో నిలువ చేసిన నీటిని పాఠశాల అవసరాలకు వినియోగిస్తున్నారు. చంపులో నిల్వ ఉన్న నీరు పైకప్పు లేకపోవడంతో నీరు కలుషితమైంది. మంచినీటి సమస్యను గుర్తించిన పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న పాలమాకుల ప్రవీణ్ కుమార్ తన స్వంత ఖర్చులతో బోరుబావి తవ్వించారు. బుధవారం రోజు మోటార్ బిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మంచినీటి సౌకర్యాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై మంచినీటి సుజల స్రవంతి తన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది చెప్పే వాళ్ళు ఉంటారు కానీ పాలమాకుల ప్రవీణ్ కుమార్ చేతలతో తన యొక్క సేవా గుణాన్ని చాటుకున్నారని అభినందించారు. అదేవిధంగా మండల విద్యాధికారి కృష్ణ మాట్లాడుతూ.. నిస్వార్థ సేవకు ప్రవీణ్ కుమార్ ప్రతీక అని కొనియాడారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వెంకన్న మాట్లాడుతూ.. పాఠశాలలో నెలకొన్న దీర్ఘకాలిక నీటి సమస్యను గుర్తించి చిన్నారి బావి భారత పౌరులకు శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన అపర భగీరథుడు డ్రాయింగ్ మాస్టర్ పాలమాకుల ప్రవీణ్ కుమార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ కుమార్ సేవా తత్పరతను కొనియాడుతూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.