తప్పు చేయనప్పుడు కేటీఆర్‌ కోర్టుకు ఎందుకు వెళ్లడం

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా భూస్థాపితం అయింది
ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలే
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుంది
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నా
టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం.

రామయంపేట జనవరి 7 సిరి న్యూస్ : మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు (Congress Party) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిందన్నారు.

తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లడం అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేల్చడం ఎంతవరకు సమంజసం అన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో వారి ఆశలు అడియాసలు అయ్యాయన్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా భూస్థాపితం అయిందన్నారు.ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుందన్నారు.అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.రాజకీయ లబ్ధి కోసం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.తెలంగాణను ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని అన్నారు.

దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రూ.500 కే గ్యాస్ సిలిండర్, ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు.గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ పాలకులు చేయని అప్పులను బిఆర్ఎస్ పార్టీ చేసి గతంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మీకే దక్కిందన్నారు.అసలు,వడ్డీ కలిపి నెలకు 6500 కోట్లు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని,బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్, సచివాలయంలోనికి పోలేని పరిస్థితులు ఉండేవన్నారు.ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా మంత్రులను, అధికారులను కలుస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల పనితీరు అని చెప్పవచ్చన్నారు.గత పది సంవత్సరాల కాలంలో హరీష్ రావు కేటీఆర్ కవిత టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏముందని అన్నారు.అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు నిరుద్యోగులకు నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయూతను కల్పిస్తూ ముందుకు కొనసాగుతుందన్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు.కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విప్లవ కుమార్, మామిడి సిద్ధ రాములు, తౌర్య నాయక్, ఎర్రం సత్యం,బొట్ల బాబు,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.