అందోల్ : వసంత పంచమి సందర్బంగా జోగిపేట పట్టణం లోని హనుమాన్ టెంపుల్ లో విద్యా సరస్వతి మాతా పిల్లలకు అక్షర అభ్యాసంగా పిల్లలకు పెన్నులు పెన్సిల్, హనుమాన్ గుడిలో మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు దంపతులు అందజేశారు. వసంత పంచమి వేడుకలు ఈ సందర్బంగా మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో అమ్మ వారికీ కుంభభిషేకం, మంగళ హరతులు, కుంకుమర్చనలు, సామూహిక అక్షరాభ్యాస లు, నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో జోగిపేట పరిసరాల భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ లో తీర్ద ప్రసాదం వితరణ చేశారు. వచ్చిన భక్తులకి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు.