ఏడుపాయల కు భారీ ఎత్తున తరలివచ్చి భక్తులు..

Devotees flocked to Edupayala in huge numbers.

మంజీర నదిలో మాఘ స్నానాలు ఆచరించిన భక్తులు..
భక్తులకు తగిన సౌకర్యాలు కలిపించిన ఈఓ చంద్రశేఖర్..

పవిత్ర పుణ్య క్షేత్రం మైన ఏడుపాయల మాఘ అమావాస్య జాతరకు ఆలయ అర్చకులు తెల్లవారుజామున శ్రీకారం చుట్టారు. ఏడుపాయల లో ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో పవిత్ర స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మేరకు మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లో మంజీర నది లో పవిత్ర స్నానాలు చేసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాదుతో పాటు, పొరుగు రాష్ట్రాలు అయినా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు లక్షల మంది భక్తులు తరలి వచ్చారు   మాఘ అమావాస్య పురస్కరించుకొని నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ వన దుర్గ భవాని అమ్మ వారిని దర్శించుకుని వివిధ రూపాలలో మొక్కుల్లో చెల్లించుకున్న భక్తులు
భక్తుల సౌకర్యాల కోసం ఆలయ ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లు చేశారు.

భక్తులు నది స్నానాలు చేసేందు కోసం సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఈ నెల 25వ తేదీన 0.35 టీఎంసీ నీటిని విడుదల చేయగా ఆ నీరు చేరికతో ఏడుపాయల లోని ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండి నిండుకుండలా మారింది. భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు వీలుగా ఘనపూర్ ఆనకట్ట దిగువన మంజీనా నది పాయల పొడవునా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు 9 చోట్ల షవర్ లు ఏర్పాటు చేశారు. భక్తులు సులభంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా క్యూలైన్స్ ఏర్పాటు చేశారు. మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఏడుపాయలు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి శ్రీనివాస్ శర్మ బ్రహ్మచారి తదితరులు సేవలు అందించారు…

వన దుర్గ భవాని మాత అమ్మవారిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్ నగేష్

మాఘ అమావాస్య పురస్కరించుకొని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ శ్రీ వన దుర్గ భవాని మాత అమ్మవారిని దర్శించుకున్నరు వారికి ఆలయ అర్చకులు ఈఓ పూర్ణ కుంభం తో ఘన స్వాగతం పలికారు
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు
ఆలయ కార్యిర్వహణాధికారి చంద్ర శేఖర్ శాలువ కప్పి సత్కరించారు.