సిరి న్యూస్ చేగుంట 09,
చేగుంట [chegunta]మండల భారతీయ జనతా పార్టీ [Bharatiya Janata Party]మండల అధ్యక్షుల బరిలో 5గురు సినియర్ నాయకులు, అదృష్టం ఎవరికి వరించినో ఎవరికివారు పైరవీలు నాకు కలిసొస్తదన్న నమ్మకం వారిలో,
సిరి న్యూస్ వారిని సంప్రదించగా, వారి వివరాలు,
1,చేగుంట పట్టణ కేంద్ర నికి తాజా మాజీ అధ్యక్షులు చింతల భూపాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా గత 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు, ఇతను గత 15 సంవత్సరం నుండి పార్టీలో ఉన్నారు,
2,గోవింద్, వడియారం గ్రామ నివాసి ఇతను గత 15 సంవత్సరముల నుండి మండలం నుండి జిల్లా వరకు వివిధ హోదాలో కొనసాగారు, ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గా ఉన్నారు, ఇతను అధిష్టానం నాకు ఇస్తారని నమ్మకంతో ఉన్నానని అన్నారు.
3, ఎల్లారెడ్డి ఇతను గత 15 సంవత్సరం బిజెపి లో ఉన్నారు అతను మాజీ మండల అధ్యక్షుడు ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు, మరియు గొల్లపల్లి తాజా మాజీ సర్పంచ్ గా ఉన్నారు, అధిష్టానం తనకే మద్దతు ఉన్నదని నమ్మకంతో ఉన్నారు.
4,వెంకటేష్ యాదవ్, మక్కా రాజు పేట్ నివాసుడు,యూవకుడు ఇతను గత 15 సంవత్సరం నుండి మండల స్థాయిలో వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు ప్రస్తుతం మండల పార్టీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు, పార్టీ అధిష్టానం యువతకు ఇస్తుందని నమ్మకంతో,యూవత తనకు పూర్తి మద్దతిస్తారని,ఈసారి యువతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని అయన అన్నారు.
5, నాగభూషణం, గ్రామం ఇబ్రహీంపూర్ ఇతను గత 4 సంవత్సరమునుండి బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు ,అతను తాజా మాజీ ఎంపీటీసీ ఇతను ముదిరాజ్ కులస్తుడు మండలంలో ముదిరాజులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నాకు ఒకసారి అవకాశం కల్పిస్తే పార్టీని అభివృద్ధి చేస్తా అని అన్నారు, సిరి ప్రతినిది వీరితో మాట్లాడగా పార్టీ నిర్ణయమే.. మేరకు తమకు అవకాశం కల్పిస్తే తప్పక పార్టీ ఎదుగుదలకు పని చేస్తామని,స్థానిక ఎన్నికలలో.. మెజార్టీ సాధించి తీరుతామని వారు ధీమా వ్యక్తం చేశారు… ఇంతకాలం అధ్యక్షులుగా పనిచేసిన వారికి ప్రమోషన్..లేక ఢీమోషన్… ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది.